Tandur: మళ్లీ వచ్చేది మన సర్కారే.. విఠల్ రెడ్డి ధీమా

Tandur: తాండూరులో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పైలెట్ రోహిత్ రెడ్డి అనుచరులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

SRIKANTH, TANDUR
Published on: 27 April 2026 5:16 PM IST
Tandur
X

Tandur: మళ్లీ వచ్చేది మన సర్కారే.. విఠల్ రెడ్డి ధీమా

Tandur: రాష్ట్రం లో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనేనని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి అన్నారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు తాండూరులోని పైలెట్ రోహిత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ను ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్బంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ..

రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.తాండూరులో మళ్లీ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలవడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి కాంగ్రెస్ పార్టీకి చేతకావడం లేదు.420 హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, సాయిపూర్ నర్సింలు, శ్రీనివాస్ చారి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కోట్రీకే విజయలక్ష్మి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు, మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్,

మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు నవీన, సుప్రియ, నాగలక్ష్మి, జావేద్, యోగానంద్, సురేష్ నాయక్, నాయకులు ఇర్ఫాన్, బషారత్ అలీ, సలీం, సంతోష్ గౌడ్, రుద్రు పాటిల్, ఇంతియాజ్, భీమ్ సింగ్, అనంత రెడ్డి, బీఆర్ఎస్వి నాయకులు దత్తాత్రేయ, ఇబ్రహీం, వినోద్, సోహెబ్, బాంబినో, కోట్రీకే శ్రీకాంత్, ఫైసల్ ఖాన్, అస్ఫక్ తదితరులు పాల్గొన్నారు.

SRIKANTH, TANDUR

SRIKANTH, TANDUR

Next Story