News Analysis: ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే అసెంబ్లీలో సస్పెన్షన్లు: హెచ్‌ఎమ్‌టీవీ ప్రత్యేక చర్చలో డా. దత్తాత్రేయ
News Analysis: సీఎం కాకముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? బీఆర్ఎస్ సీనియర్ నేత డా. దత్తాత్రేయ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.
News Analysis: ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే అసెంబ్లీలో సస్పెన్షన్లు: హెచ్‌ఎమ్‌టీవీ ప్రత్యేక చర్చలో డా. దత్తాత్రేయ
News Analysis: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరియు బీఆర్ఎస్ నిర్వహించిన 'మాక్ అసెంబ్లీ' అంశాలపై హెచ్‌ఎమ్‌టీవీ నిర్వహించిన ప్రత్యేక చర్చా వేదికలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డా. దత్తాత్రేయ, బీజేపీ నేత శంకరబోయిన రవికుమార్, కాంగ్రెస్ నేత జితేందర్ పాల్గొని వివిధ అంశాలపై వాడివేడి వాదనలు వినిపించారు.
ప్రతిపక్షాన్ని అసెంబ్లీలోకి రానీయకుండా, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సస్పెన్షన్లకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేత డా. దత్తాత్రేయ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతోనే ప్రజాస్వామ్య బద్ధంగా 'మాక్ అసెంబ్లీ' నిర్వహించి ప్రభుత్వాన్ని ఎండగట్టామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు దాటినా ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తిగా అమలవుతలేదని ఆరోపించారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు మోసపోయారని, ముఖ్యమంత్రి మరియు మంత్రుల భాషపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.




