కేసీఆర్‌పై కోపంతోనే కాళేశ్వరాన్ని మూసేశారు.. రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ నేత ఫైర్!

కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించకపోవడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రిమినల్ ఇంటెన్షన్ ఉందని బీజేపీ నేత ఆల్జాపూర్ శ్రీనివాస్ ఆరోపించారు.

Arun Chilukuri
Updated on: 6 July 2026 11:16 AM IST
కేసీఆర్‌పై కోపంతోనే కాళేశ్వరాన్ని మూసేశారు.. రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ నేత ఫైర్!
X

కేసీఆర్‌పై కోపంతోనే కాళేశ్వరాన్ని మూసేశారు.. రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ నేత ఫైర్!

తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. హెచ్‌ఎంటీవీ నిర్వహించిన ప్రత్యేక డిబేట్‌లో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును మూలన పడేశారని ఆయన ఆరోపించారు.

తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని లక్ష్మీ నరసింహ రెడ్డి గుర్తుచేశారు. "కాళేశ్వరం అంటే కేవలం ఒక్క మేడిగడ్డ బ్యారేజీ లేదా ఒక్క పిల్లర్ మాత్రమే కాదు. ఇది 275 కిలోమీటర్ల మేర సాగే భారీ వ్యవస్థ. 13 జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించడంతో పాటు హైదరాబాద్‌కు 30 టీఎంసీల నీటిని అందించే అద్భుత ప్రాజెక్ట్" అని ఆయన వివరించారు. ఒక చిన్న పిల్లర్ కుంగిపోవడాన్ని సాకుగా చూపిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం గత 30 నెలలుగా కాలయాపన చేస్తూ డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story