Kamareddy: హామీలు ఏమయ్యాయి.. ఉద్యమకారులకు స్వేచ్ఛ లేదా?

Kamareddy: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు, ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 4:20 PM IST
Kamareddy
X

Kamareddy: హామీలు ఏమయ్యాయి.. ఉద్యమకారులకు స్వేచ్ఛ లేదా?

Kamareddy: బిచ్కుంద (కామారెడ్డి) ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ లో ఉన్న ఉద్యమకారులకు స్వచ్ఛ లేకుండా పోయిందని బిచ్కుంద మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజి సర్పంచ్లు వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం లో పూర్తిగా విఫలమైందని ఈ విషయం పై ప్రభుత్వం నుండి పూర్తి స్పష్టత వచ్చేలా చేసేందుకు తల పెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా జుక్కల్ నియోజకవర్గం లోని పలు మండలాల్లో బి ఆర్ ఎస్ పార్టీ మాజి సర్పంచ్లు, ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడని వ్యతిరేకించారు.

చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు తెల్లవారు జామున మాజి సర్పంచుల ఇండ్ల వద్దకు వెళ్లి ముందస్తు అరెస్టు చేయడం పై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కిందని కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒంటరి మహిళలకు పెన్షన్, అర్హులైన వారికి దళిత బంధు, రైతు భరోసాతోపాటు ఆరు గ్యారంటీ లు ఎటు పోయాయో ఇవి పూర్తిగా విస్మరించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు. కార్యక్రమం లో వెంకట్ రావు దేశాయ్, హస్గుల్ మాజి సర్పంచ్ అశోక్, ర్యాల గంగారెడ్డి, భూంశెట్టి, డాక్టర్. రాజు, బొమ్మ లక్ష్మణ్, దరావర్. సూర్యకాంత్, నవాజ్, జావిద్ సిద్ధికి, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story