Telangana: ఫిలింనగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం!
Telangana: కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేత వెంకీ ముదిరాజ్ డిమాండ్ చేసి ఫిర్యాదు చేశారు.
Telangana: ఫిలింనగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం!
Telangana: కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కేసు నమోదు చేయాలని ఫిలింనగర్ డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నేత వెంకీ ముదిరాజ్ డిమాండ్ చేశారు. కెసిఆర్ తెలంగాణకు పట్టిన శని అంటూ కేసిఆర్ చావును కోరుకున్నట్లు ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యానించడాన్ని తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండిస్తున్నదని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఫిలింనగర్ లో ఎమ్మెల్యే శంకర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కోట్లాదిమంది ఆకాంక్షను నెరవేర్చిన కేసీఆర్ లాంటి పెద్దమనిషి పై పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వీర్లపల్లి శంకర్ పై కేసు నమోదు చేయాలని ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story




