Nandipet: నందిపేట్‌లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
Nandipet: నందిపేట్ మండలంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు జరిగాయి.
Nandipet: నందిపేట్‌లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
Nandipet: నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ దేశం కోసం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తాడిత పీడత వర్గాల కోసం అణచివేత వర్ణ వివక్షకు వ్యతిరేకంగా చేసిన పోరాటం రాజ్యాంగ రూపకల్పన గూర్చి ఆయన చేసిన కృషిని కొనియాడడం జరిగింది.
శతాబ్దాలకు ఒకరు మాత్రమే దేశ ఔన్నత్యానికి తోడ్పడుతారని వారిలో అంబేద్కర్ ఒకడని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉల్లి శ్రీనివాస్, బాలగంగాధర్, సయ్యద్ హుస్సేన్, దారం సురేష్, రామారావు, తాటికాయల సుభాష్, మాజీ ఉప సర్పంచ్ భరత్, వార్డు మెంబర్లు రాజేందర్, సాయిలు, రమేష్, తాటికాయల సాగర్, జూల రవి, రాజేశ్వర్, మేకల చిన్నయ్య, బాలరాజ్, బాలు, ధర్మపురి, శ్రీనివాస్, అశోక్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.




