Telangana: యువ ఇంజినీర్లపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గం కేటీఆర్!

Telangana: యువ ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సీఎం వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 July 2026 11:49 PM IST
Telangana
X

Telangana: యువ ఇంజినీర్లపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గం కేటీఆర్!

తెలంగాణ: తెలంగాణ యువ ఇంజినీర్ల ప్రతిభను "క్రిమినల్ వేస్ట్" అంటూ అవమానించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా తీవ్రంగా స్పందించారు.

తెలంగాణ యువత సామర్థ్యాన్ని కించపరిచేలా మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు. తన జీవితంలో ఎప్పుడైనా ఒక పోటీ పరీక్ష రాశారా? ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు హాజరయ్యారా? ఏదైనా వృత్తిపరమైన సంస్థలో పనిచేసిన అనుభవం ఉందా? అని వరుస ప్రశ్నలు సంధించారు.

రేవంత్ రెడ్డి గతాన్ని ప్రజలు మరచిపోలేదని పేర్కొన్న కేటీఆర్, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం బ్లాక్‌మెయిల్ రాజకీయాల వరకు వెళ్లిందని విమర్శించారు. దివాళా తీసిన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవిని కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, దేశానికి సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లను అందిస్తున్న తెలంగాణ యువతను అవమానించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.

తెలంగాణ యువత కృషి, ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుండగా, వారిని అవమానించే వ్యాఖ్యలను ముఖ్యమంత్రి వెంటనే ఉపసంహరించుకుని రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story