Hayathnagar: హాల్ టికెట్ ఇవ్వలేదని బీటెక్ విద్యార్థి బలి!
Hayathnagar: ఫీజు చెల్లించలేదనే నెపంతో హాల్ టికెట్ నిరాకరించడంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హయత్ నగర్ పరిధిలో కలకలం రేపింది.
Hayathnagar: హాల్ టికెట్ ఇవ్వలేదని బీటెక్ విద్యార్థి బలి!
Hayathnagar: హాల్ టికెట్ ఇవ్వలేదని.. బీటెక్ విద్యార్థిఆత్మహత్య, శ్రీ ఇందు కాలేజ్ యాజమాన్యం వల్లే చనిపోయాడంటూ తల్లిదండ్రుల ఆరోపణ, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. పరీక్షలు రాయడానికి హాల్ టికెట్ ఇవ్వలేదని ఇబ్రహీంపట్నం శ్రీ ఇందుబీటెక్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండల కేంద్ర్రానికి మ్యాదరి ప్రణీత్ కుమార్ (22) రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని శ్రీ ఇందు కాలేజీలో సీఎస్సీ - డీ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు పరీక్షల సమయం కావడంతో ఫీజు కట్టలేదని కాలేజీ యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో మనస్థాపాoచెందిన ప్రణీత్ ఉదయం సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




