Karimnagar: కొండన్నపల్లిలో 'కంటి వెలుగు'.. బీసీఎం ట్రస్ట్ ఉచిత శిబిరం!

Karimnagar: కరీంనగర్ జిల్లా కొండన్నపల్లిలో బుచ్చమ్మ చంద్రమౌళి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 March 2026 11:48 AM IST
Karimnagar
X

Karimnagar: కొండన్నపల్లిలో 'కంటి వెలుగు'.. బీసీఎం ట్రస్ట్ ఉచిత శిబిరం!

Karimnagar: గ్రామీణ పేద ప్రజలకు కంటి వైద్య సేవలు అందించడం లక్ష్యంగా బుచ్చమ్మ చంద్రమౌళి మెమోరియల్ ట్రస్ట్ కంటి దావఖాన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని కొండన్నపల్లి సర్పంచ్ రేండ్ల శ్రీనివాస్ ప్రారంభించారు. సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి బుధవారం కొదురుపాక బీ సి ఎం కంటి దవాఖాన ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ, కంటి పరీక్షలు మరియు అవసరమైతే ఉచిత కంటి ఆపరేషన్లు కూడా నిర్వహించడం పేద ప్రజలకు గొప్ప అవకాశమని అభినందించారు.

ఈ కార్యక్రమంలో బీ సి ఎం వ్యవస్థాపకురాలు, ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ రీటా బహదూర్ షా, కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. సర్పంచ్ శ్రీనివాస్, గ్రామీణ పేద ప్రజలు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story