Narsapur: BVRITలో ఈటి ఉత్సవ్ 2026 అంతర్జాతీయ సదస్సు ఘనప్రారంభం

Narsapur: నర్సాపూర్ BVRIT కళాశాలలో ‘ఈటి ఉత్సవ్ 2026’ అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 April 2026 5:21 PM IST
Narsapur
X

Narsapur: BVRITలో ఈటి ఉత్సవ్ 2026 అంతర్జాతీయ సదస్సు ఘనప్రారంభం

Narsapur: బి వి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BVRIT), నర్సాపూర్‌లోని ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో “సస్టైనబిలిటీ మరియు ఆటోనమస్ వాహనాల కోసం యుటిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీస్” అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు ఈటి ఉత్సవ్ (ETUTSAV)–2026 ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు దేశ విదేశాల నుండి పరిశోధకులు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డా. పాములపర్తి బాలకృష్ణ, సీనియర్ ఇంజనీర్ – ఎమర్జింగ్ టెక్నాలజీస్ & గ్లోబల్ IP కోఆర్డినేటర్, జీఈ వెర్నోవా (GE Vernova), మొదటి కీనోట్ ప్రసంగాన్ని ఇచ్చారు. వారు సదస్సు లో మాట్లాడుతూ “ఉద్భవిస్తున్న సాంకేతికతలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం ఎమర్జింగ్ టెక్నాలజీస్” అనే అంశంపై తన ప్రసంగంలో ప్రస్తుత కాలంలో స్మార్ట్ మీటర్, స్మార్ట్ గ్రిడ్స్, శుద్ధ శక్తి సమీకరణ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, డిజిటల్ డేటా అనాలిసిస్, స్వయంప్రతిపత్తి గ్రిడ్‌లు మరియు AIML అప్లికేషన్‌లు, వంటి ఆధునిక సాంకేతికతల ప్రాధాన్యతను వివరించారు.

రెండవ కీనోట్ సెషన్‌ను ఇండోనేషియాలోని సమ్ రాటులాంగి యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఇర్. అలీషియా సిన్సువ్ ఆన్‌లైన్ ద్వారా అందించారు. “సింబయోసిస్ ఎనర్జీ: క్లీన్ ఎనర్జీ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ సమన్వయం ద్వారా సస్టైనబుల్ ప్రభావం” అనే అంశంపై ఆమె ప్రసంగం విద్య ఆధారిత ఆవిష్కరణలు మరియు కమ్యూనిటీకి ఉపయోగపడే పరిశోధన ప్రాముఖ్యతను తెలియజేసింది. ఆమె వర్చువల్ పాల్గొనడం అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసింది.

అనంతరం ప్యారలల్ టెక్నికల్ సెషన్లు నిర్వహించబడ్డాయి. ప్రముఖ విద్యావేత్తలు వీటికి అధ్యక్షత వహించారు: డా. బి. మహిపాల్, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బెంగళూరు వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & దాని అనువర్తనాలు అంశాలపై, డా. ఎ. రాజు, శ్రీ విష్ణు విద్యా సంస్థ పరిశోధన మరియు అభివృద్ధి సంచాలకుడు వారు పవర్ సిస్టమ్స్ & సస్టైనబిలిటీ అంశాలపై, డా. ఎం. సూర్య కలావతి, ప్రొఫెసర్, జేఎన్‌టీయూహెచ్, హైదరాబాద్, వారు ఐఓటీ-ఎంబెడెడ్ సిస్టమ్స్, రోబోటిక్స్ & ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ విభాగంపై, డా. ఎ. జయ లక్ష్మి, ప్రొఫెసర్ & డైరెక్టర్ (UGC అఫైర్స్), జేఎన్‌టీయూహెచ్, హైదరాబాద్, వారు ఎలక్ట్రిక్ వాహనాలు & ఆటోనమస్ వాహనాలు అంశాలపై వారు అదక్షత వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే స్వాగత ప్రసంగం అందిస్తూ, సాంకేతిక సాధనాల వినియోగం, AI అప్లికేషన్లలో కొత్త పాత్రలు, జనరేటివ్ థింకింగ్ ప్రాముఖ్యతపై మూడు ముఖ్యాంశాలు ప్రస్తావించారు. చిన్న ఆలోచన పెద్ద మార్పులకు దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ డా. లక్ష్మీ ప్రసాద్ తన ప్రసంగంలో విద్యార్థులు మరియు పరిశోధకులు ఆవిష్కరణాత్మక ఆలోచనలను అభ్యసించాలని, పరిశోధనలను సమాజానికి ఉపయోగపడే విధంగా మలచడం అవసరమని వారు సూచించారు.

ఈ సెషన్లలో పరిశోధకులు, విద్యార్థులు తమ పరిశోధన పత్రాలను సమర్పించి నిపుణుల నుండి విలువైన సూచనలు పొందారు. ఈ సదస్సు ద్వారా శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకునే అవకాశం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

ఈ అంతర్జాతీయ సదస్సు చైర్ పర్సన్ గా డా. కె. రాయుడు మార్గదర్శకత్వంలో నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాల అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, ఇండస్ట్రీ , కార్పొరేట్ విభాగాల వారు పాల్గొన్నారు. అన్ని విభాగాధిపతులు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కళాశాల మేనేజర్ శ్రీ బి. బాపి రాజు మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ టి.ఎల్.ఎన్. సురేష్ పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు.

ఈ సదస్సు విజయవంతం కావడంలో సహకరించిన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ANRF), అవఘ్ని సోలార్, రెట్రోన్ ఎనర్జీస్ మరియు ఇతర సంస్థల నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్, డా. సంజయ్ దూబే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story