Karimnagar: భక్తితో భద్రత.. సీసీ కెమెరాలను అందించిన దాత
Karimnagar: వీణవంక మండల మల్లారెడ్డిపల్లి శ్రీ సీతారామాంజనేయ ఆలయానికి 20 వేల విలువైన సీసీ కెమెరాల బహుకరణ.
Karimnagar: భక్తితో భద్రత.. సీసీ కెమెరాలను అందించిన దాత
కరీంనగర్ జిల్లా: వీణవంక మండలం, మల్లారెడ్డిపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ దేవాలయానికి 20వేల రూపాయల విలువగల సీసీ కెమెరాలు దేశాయి పల్లి గ్రామవాస్తవ్యులు కీర్తిశేషులు మంద మధుసూదన్ రెడ్డి వీణవంక మండల మొదటి (మాజీ) ఎంపీపీ జ్ఞాపకార్థం వారి కుమారుడు మంద రాంరెడ్డి 20వేల రూపాయల విలువగల 5 సీసీ కెమెరాలు బహుకరణ చేసి తనే స్వయంగా ఫిటింగ్ చేసి మల్లారెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి అందజేసినారు. ఈ సందర్భంగా మేకల ఎల్లారెడ్డి మాట్లాడుతూ మంద మధుసూదన్ రెడ్డి వీణవంక మండల మొదటి ఎంపీపీగా తన సేవలు మండలం ప్రజలకు అందించినారని వారి రాజకీయ జీవితాన్ని మొత్తం ప్రజలకే అంకితం చేసినారని తన సేవలను గుర్తు చేసుకున్నారు.
వారి జ్ఞాపకార్థం సీసీ కెమెరాలు బహుకరణ చేసిన వారి కుమారుడు మంద రాంరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి,సీసీ కెమెరాల దాత మందరాంరెడ్డి,మాజీ ఉప సర్పంచ్ ముద్దసాని బిక్షపతి, అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్, వీణవంక మండల ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు పల్లెర్ల కిరణ్ గుప్తా, మేకల తిరుపతిరెడ్డి,దూలం కిరణ్, కర్రె స్వామి, కర్రె కిష్టయ్య,ముద్దసాని కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.




