Tungabhadra Water Dispute: తుంగభద్ర వివాదంపై కేంద్రం యాక్షన్.. 9 మందితో హైలెవల్ కమిటీ!

Tungabhadra Water Dispute: తుంగభద్ర జలాల సమస్యల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ 9 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

Arun Chilukuri
Published on: 14 July 2026 10:33 AM IST
Tungabhadra Water Dispute
X

Tungabhadra Water Dispute: తుంగభద్ర వివాదంపై కేంద్రం యాక్షన్.. 9 మందితో హైలెవల్ కమిటీ!

Tungabhadra Water Dispute: తుంగభద్ర జలాలపై కేంద్ర జలశక్తి శాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సీడబ్ల్యూసీ మెంబర్ చైర్మన్ గా తొమ్మిది మంది సభ్యులుతో కమిటి నియమించింది. కమిటీలో కర్ణాటక జలవనరుల కార్యదర్శి, ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు, తుంగభద్ర బోర్డు కార్యదర్శి, సీడబ్ల్యూసీ ఇంజినీర్లు ఉన్నారు. నదీ పరివాహక ప్రాంతంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయన కమిటీ చర్చించనున్నది. ఆరు అంశాలపై ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

న్యాయపరమైన, సాంకేతిక, ఆపరేషనల్, సంస్థాగత మైన అంశాలను కమిటీ అధ్యయనం చేయనున్నది. తుంగభద్ర బోర్డు తో సంప్రదింపులు, ఆర్డీఎస్ కింద సాగునీటి అవసరాలను గుర్తించాల్సి ఉంది. ఇటీవల తుంగభద్ర జలాశయం గేట్ల ప్రారంభోత్సవానికి హాజరైన కర్ణాటక, తెలంగాణ, ఏపీ సీఎంలతో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్. పాటిల్ సమావేశమయ్యారు. రిజర్వాయర్ లో పూడిక తీత, నావలి రిజర్వాయర్, ఆర్డీఎస్ ఆధూనీకీకరణపై చర్చించారు. న్యాయపరమైన, ఉన్నత స్థాయి కమిటీ అవసరమైతే ఉపకమిటీలు వేసుకునేందుకు అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story