Chada Venkat Reddy: హిట్లర్‌కు పట్టిన గతే ట్రంప్‌కూ పడుతుంది.. సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి హెచ్చరిక
Chada Venkat Reddy: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ నియంత హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని, ఆయనకు కూడా హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Chada Venkat Reddy: హిట్లర్‌కు పట్టిన గతే ట్రంప్‌కూ పడుతుంది.. సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి హెచ్చరిక
కరీంనగర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ నియంత హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని, ఆయనకు కూడా హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇరాన్ చమురు సంస్థలపై అమెరికా చేస్తున్న దాడులు, దేశంలో పెరుగుతున్న గ్యాస్ కొరతను నిరసిస్తూ కరీంనగర్‌లోని గీతా భవన్ చౌరస్తాలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు.
యుద్ధోన్మాదిగా ట్రంప్.. కలియుగ రావణసురుడు:
ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచంపై ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారని విమర్శించారు. ఇరాన్‌లోని చమురు నిక్షేపాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని, ఇది కలియుగ రావణకాష్టాన్ని తలపిస్తోందని అన్నారు. యుద్ధాల వల్ల ఇంధన ధరలు పెరిగి సామాన్యులు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీ మౌనం వీడాలి:
ట్రంప్ చేస్తున్న ఆగడాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండటం సరికాదని చాడ డిమాండ్ చేశారు. అమెరికా విధానాల వల్ల భారత్‌లో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైందని, హోటళ్లు, వాణిజ్య అవసరాలకు సిలిండర్లు దొరకక మళ్లీ కట్టెల పొయ్యిలే దిక్కయ్యే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. గృహ అవసరాలకు 45 రోజులు గడిచినా సిలిండర్ రావడం లేదని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
కట్టెల పొయ్యిలతో వినూత్న నిరసన:
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సిపిఐ శ్రేణులు గ్యాస్ సిలిండర్లను భుజాన ఎత్తుకుని, కట్టెల పొయ్యిలు వెలిగించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.




