Chinna Reddy: నేను కూడా జీవన్‌రెడ్డిలా మారాలా?.. రేవంత్‌పై చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Chinna Reddy: సీఎం రేవంత్ రెడ్డి డబ్బులకు ఆశపడే ఎమ్మెల్యే మేఘారెడ్డికి వనపర్తి టికెట్ ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత జి. చిన్నారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
Chinna Reddy: నేను కూడా జీవన్‌రెడ్డిలా మారాలా?.. రేవంత్‌పై చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Chinna Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుల అసంతృప్తి జ్వాలలు మరోసారి బహిర్గతమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి. చిన్నారెడ్డి అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల టికెట్ల కేటాయింపుపై చిన్నారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. "సోనియా గాంధీ స్వయంగా నాకు టికెట్ ఖరారు చేసి, చిన్నారెడ్డి దగ్గర డబ్బులు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకుని గెలిపించాలని రేవంత్ రెడ్డికి చెప్పారు. కానీ, రేవంత్ రెడ్డి డబ్బులకు ఆశపడి మేఘారెడ్డి వద్ద భారీగా డబ్బులు తీసుకుని అతనికి టికెట్ ఇచ్చారు" అని బాంబు పేల్చారు. ‘మీరే సీఎం అవుతారు’ అని రేవంత్‌కి ముందే చెప్పినా తనపై నమ్మకం ఉంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తన అనుచరులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని చిన్నారెడ్డి మండిపడ్డారు. "పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవన్ రెడ్డి లాగా నేను కూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుంది" అని ఘాటుగా హెచ్చరించారు.
ఎన్ని అవమానాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. "నేను పార్టీ వదిలి వెళ్లను. మేఘారెడ్డి లాంటి తప్పుడు వ్యక్తులను పార్టీ నుంచే తరిమేస్తాను" అని వ్యాఖ్యానించారు.




