Keesara: చీర్యాలలో అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం
Keesara: కీసర సర్కిల్ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
Keesara: చీర్యాలలో అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం
Keesara: కీసర సర్కిల్ చీర్యాలోఅంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ ఫౌండర్& చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ.
ఈ బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఉదయం నవ కళాశాభిషేకం ,శ్రీ సుదర్శన నారసింహ హోమం ,స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛరణ తో ఆలయ ఫౌండర్& చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ చేతులమీదుగా ఈ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు, స్వామివారిని . బండారు దత్తాత్రేయ గారు మాజీ గవర్నర్ మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు,
స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన నవీన్ మిట్టల్ ఐఏఎస్ తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ విద్యుత్ శాఖ వీరికి ఆలయ ఫౌండర్ & చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ వేదపండితుల తో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి శేష వస్త్రాలు తీర్థప్రసాదాలతో ఘనంగా ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త శ్రీహరి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




