Choppadandi: రోడ్డుపై తగలబడ్డ బైక్.. కళ్లముందే బూడిదైన వాహనం

Choppadandi: చొప్పదండి మండలం కొలిమికుంట వద్ద ప్రయాణంలో ఉండగానే ఓ బైక్ అకస్మాత్తుగా తగలబడింది.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 18 April 2026 7:26 PM IST
Choppadandi
X

Choppadandi: రోడ్డుపై తగలబడ్డ బైక్.. కళ్లముందే బూడిదైన వాహనం

Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామ సమీపంలో ఓ ద్విచక్ర వాహనం అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పెద్దపల్లి జిల్లా నంది మేడారం గ్రామానికి చెందిన శాండల మహేష్ వర్మ తన భార్యతో కలిసి వైద్య చికిత్స కోసం కరీంనగర్‌కు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ప్రయాణ మధ్యలో కొలిమికుంట గ్రామ సమీపానికి రాగానే ద్విచక్ర వాహనం నుంచి పొగలు వస్తున్నాయని మహేష్ దంపతులు గమనించారు ఇంతలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం మొత్తం వ్యాపించాయి. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు.

అదే సమయంలో అటుగా కారులో వెళ్తున్న కొందరు యువకులు ఈ ఘటనను గమనించి వెంటనే స్పందించారు. కొంత దూరంలో నుంచి నీరు తీసుకొచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అప్పటికే మంటలు తీవ్రరూపం దాల్చడంతో ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది.

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాహనంలో సాంకేతిక లోపం ఏర్పడి మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story