Choppadandi: పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం.. ఎమ్మెల్యే

Choppadandi: చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 17 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 18 April 2026 6:41 PM IST
Choppadandi
X

Choppadandi: పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం.. ఎమ్మెల్యే

Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద చొప్పదండి పట్టణ కేంద్రానికి చెందిన 17 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను చొప్పదండి శాసన సభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహసౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని పేర్కొన్నారు.

లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని త్వరితగతిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వడ్లూరి సరిత శ్రీనివాస్, వైస్ చైర్మన్ పెరుమాండ్ల మానస గంగయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story