Karimnagar: గణేష్ మండపం కోసం స్థలం కేటాయించాలి.. ఎమ్మెల్యేకు విన్నపం

Karimnagar: చొప్పదండి పట్టణం 10వ వార్డులో వినాయక విగ్రహ ప్రతిష్ఠ కోసం స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు విన్నవించిన కౌన్సిలర్ గుర్రం సుజిత్ రెడ్డి మరియు స్థానికులు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 19 April 2026 10:31 AM IST
Karimnagar
X

Karimnagar: గణేష్ మండపం కోసం స్థలం కేటాయించాలి.. ఎమ్మెల్యేకు విన్నపం

Karimnagar: గణేష్ నవరాత్రుల షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యంను కలిసిన 10వ వార్డు ప్రజలు ఈరోజు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం ను కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణం 10వ వార్డు ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి గణేష్ నవరాత్రుల సందర్భంగా వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ కోసం శాశ్వత షెడ్డు నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ మరియు కౌన్సిలర్ల ఫోరం అధ్యక్షులు గుర్రం సుజిత్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డు యూత్ సభ్యులు, స్థానిక యువకులు కలిసి ఎమ్మెల్యే ను కలిసి 12 బై 12 అడుగుల వినాయకుని షెడ్డు నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరారు.

వినతి పత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే సమస్యను సానుకూలంగా పరిశీలించి, తప్పకుండా స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఎమ్మెల్యే స్పందనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, గణేష్ నవరాత్రుల వేడుకలు మరింత ఘనంగా నిర్వహించేందుకు ఈ షెడ్డు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story