Karimnagar: ఆర్టీసీని బలోపేతం చేయండి.. ప్రైవేట్ బస్సుల విధానం వీడండి!
Karimnagar: కరీంనగర్ జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బస్సుల విధానం (GCC) వల్ల ఆర్టీసీకి నష్టం జరుగుతోందని ఆందోళన.
Karimnagar: ఆర్టీసీని బలోపేతం చేయండి.. ప్రైవేట్ బస్సుల విధానం వీడండి!
కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎం వి యాక్టివ్ 2019 మరియు విద్యుత్ బస్సుల విధానం వల్ల ఆర్టీసీలు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని విద్యుత్ బస్సుల వల్ల ఆర్టీసీలో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు మాత్రమే ఆర్టీసీలో మిగిలే పరిస్థితి ఉంటుంది. విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి విద్యుత్ బస్సులో కొనుగోలు నిర్వహణ ఆపరేషన్ అన్ని ఆర్టీసీనే చర్యలు తీసుకోవాలని ఆర్టీసీల ఆదాయానికి ఖర్చుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వాలు రియంబర్స్ చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తూ డిపో ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించింది.
విద్యుత్తు బస్సుల వల్ల ప్రజలపై అధిక భారం..
సిఐటియు జిల్లా అధ్యక్షులు యు శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులో పథకాలన్నీ క్గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో కొనుగోలు చేసి ఆర్టీసీ ఎటువంటి పాత్ర లేకుండా విద్యుత్ బస్సులో నడిచిన నడవకుండా ఆర్టీసీ డబ్బులు చెల్లించే విధంగా ఈ కాంట్రాక్టు విధానం తీసుకురావడం జరిగింది. ఈ విధానం వల్ల ఆర్టీసీకి ప్రతి రోజుకు 50 లక్షల ప్రజలపై భారం పడుతున్నది. సంవత్సరానికి రూ. 182 కోట్లు ఖర్చు అవుతుంది. భవిష్యత్తులో మరింత భారం పెరుగుతున్నది. విద్యుత్ బస్సులో స్కీమ్ అమల్లో ఆర్టీసీ ఇలాంటి ప్రాథమిక లేకుండా చేసి కేవలం ప్రైవేట్ పెట్టుకోవాలి.లాభాల గ్యారెంటీ చేయడంతో పాటు మొత్తం ప్రైవేట్ వారికి అప్పగించడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
కార్పొరేట్ సంస్థలకు లాభం చేయడమే విద్యుత్ బస్సులుబస్సులు..
విద్యుత్ బస్సులకు విద్యుత్ సబ్ స్టేషన్లు మౌలిక వసతులు కల్పన పేరుతో ఆర్టీసీలకు ఉన్న భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం జరుగుతున్నది. కరీంనగర్లో కొంత భూమి ప్రైవేట్ కంపెనీలకు అప్పగించిన చరిత్ర కూడా ఉన్నది.భూమి ఏ పేరుతో ప్రైవేట్ వారి చేతిలో పోయిన భవిష్యత్తులో ప్రజల అవసరాలు మేరకు ఆర్టీసీని విస్తరించడం గాని బలపత్రం చేయడం గాని కొత్త బస్సు డిపో ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. 33 లక్షల కి వచ్చేకొత్త RYC బస్సు స్థానంలో కోటి రూపాయలు ఖర్చుపెట్టి విద్యుత్ బస్సు కొనుగోలు చేస్తున్నారు. ఒక విద్యుత్ బస్సు కొనుగోలు చేస్తే 35 లక్షల రూపాయల సబ్సిడీ ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం జరుగుతుంది.
ఉపాధి కోల్పోనున్న డ్రైవర్లు, మెకానికులు కండక్టర్లు..
విద్యుత్ బస్సుల ప్రవేశం వల్ల డ్రైవర్లు మెకానికులు ఉద్యోగులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కండక్టర్లు కూడా ఉద్యోగాల కోల్పోయే ప్రమాదం ఉంది.ఆర్టీసీ ఆదాయం పెరిగిన విద్యుత్ బస్సులకు చెల్లించేది ఎక్కువగా ఉన్నందున తీవ్ర సంక్షేమంలో ఆర్టీసీకి వెళుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బస్సుల విధానంలో మార్పు చేయాలి. జిసిసి పద్ధతిని రద్దు చేయాలి.
ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్న అన్ని సబ్సిడీలను ఆర్టీసీలకు ఇవ్వాలి. ఆర్టీసీ నేరుగా విద్యుత్ బస్సులు నడిపించాలి బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయాలి ఆర్ టి వి సి బస్సులు ఆపరేషన్ ఖర్చుకు ఆదాయానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వాలు రియంబర్స్ ఆర్టీసీకి ఇవ్వాలి విద్యుత్ బస్సులో బాడీ ఫ్యాబ్రికేషన్ ఆర్టీసీ వర్క్ షాప్ లలో చేయించాలి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి ప్రజల అవసరాలను మేరకు బస్సుల సంఖ్యను పెంచాలి. పీఎంఈ డ్రైవర్ పథకంలో వస్తున్న సబ్సిడీని ఆర్టీసీ చేసే మెట్రో ఫిట్మెంట్ బస్సులో కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్ జిల్లా కోశాధికారి జి రాజేశం జిల్లా సహాయ కార్యదర్శిలు పున్నం రవి, కొప్పుల శంకర్ నగర కన్వీనర్ పుల్లెల మల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు పిల్లి రవి, వల్లూరి కిషోర్,రాజన్న,తిండిగాల సతీష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.




