Banjara Hills: ఏడాదిన్నర చిన్నారికి అరుదైన మెదడు సర్జరీ సక్సెస్

Banjara Hills: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు.

RAJESH,	WEST ZONE
Published on: 3 April 2026 10:06 PM IST
Banjara Hills
X

Banjara Hills: ఏడాదిన్నర చిన్నారికి అరుదైన మెదడు సర్జరీ సక్సెస్

Banjara Hills: అరుదైన మెదడు రక్తనాళ వ్యాధితో బాధపడుతున్న ఏడాదిన్నర వయసున్న చిన్నారికి బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూరో సర్జరీ విభాగం డాక్టర్ రవి వర్మ, పద్మశ్రీ వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన రవి అఖిల దంపతుల కుమారుడు రక్షిత్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

చిన్నారికి న్యూరో సమస్య ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు న్యూరో సర్జన్ ను కలవాల్సిందిగా సూచించడంతో వారు బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో వైద్యులను సంపాదించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారి బాబుకు మెదడులో రక్తనాళ వ్యాధి రైట్ పోస్టిరీయర్ సెరిబ్రల్ ఆర్టరీ లో లార్జ్ ఫ్యూసిఫార్మ్ అన్యూరిజం వ్యాధితో బాధ పడుతున్నట్లుగా గుర్తించారు.

ఈ వ్యాధి వల్ల చిన్నారికి ప్రాణాపాయస్థితి ఉంటుందని ప్రతి పది లక్షల మంది చిన్నారుల్లో ఒకటి లేదా రెండు కేసులు మాత్రమే ఇలా ఉంటాయని డాక్టర్ రవి వర్మ తెలిపారు. చిన్నారికి మెదడులో ఉబ్బిన రక్తనాళానికి అత్యంత జాగ్రత్తగా సర్జరీ చేసి విజయవంతం అయినట్లు వారు తెలిపారు. చిన్నారుల్లో ఇలాంటి అన్యూరిజమ్‌లు అత్యంత అరుదుగా ఉంటాయని ఈ పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో అధునాతన చికిత్సను నిర్వహించినట్లు తెలిపారు. అత్యాధునిక న్యూరో ఇంటర్వెన్షన్ విధానం అయిన కాయిల్ ఎంబోలైజేషన్ తో పాటు పేరెంట్ ఆర్టరీ ఓక్లూజన్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ అనస్థీషియా వైద్యులు కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story