Ranga Reddy: హక్కులపై అవగాహనతోనే సమాజాభివృద్ధి పౌర హక్కుల దినోత్సవం!

Ranga Reddy: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం శెట్టిపల్లిలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి, రాజ్యాంగ హక్కులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 1 Oct 2026 7:37 AM IST
Ranga Reddy
X

Ranga Reddy: హక్కులపై అవగాహనతోనే సమాజాభివృద్ధి పౌర హక్కుల దినోత్సవం!

Ranga Reddy: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం ::- పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమనగల్ మండలం శేట్టిపల్లి గ్రామంలో బుధవారం పౌర హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు పౌర హక్కులు, రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, అంటరానితనం నిర్మూలన తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రతి పౌరుడు తన హక్కులను తెలుసుకోవడంతో పాటు ఇతరుల హక్కులను గౌరవించాలని సూచించారు.

అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు, బాధితుల హక్కులు, హక్కుల పరిరక్షణ కోసం అందుబాటులో ఉన్న చట్టపరమైన చర్యలను అధికారులు వివరించారు.

ఎలాంటి వివక్షకు తావులేకుండా రాజ్యాంగ స్ఫూర్తితో సమానత్వాన్ని పాటించాలని సూచించారు. గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY