బీఆర్ఎస్ ఒక చచ్చిన శవం.. కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల పంచాయతీ: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Revanth Reddy: బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిపోయిందని, కేసీఆర్ కుటుంబంలో కేవలం ఆస్తుల పంచాయతీ మాత్రమే జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ఒక చచ్చిన శవం.. కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల పంచాయతీ: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో విపక్ష బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు. మీడియా ప్రతినిధులతో సరదాగా సాగిన ‘చిట్ చాట్’లో ఆయన బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు మరియు కేసీఆర్ కుటుంబ అంతర్గత వ్యవహారాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
బీఆర్ఎస్‌కు కాలం చెల్లిపోయింది!
బీఆర్ఎస్ పార్టీ ఒక చచ్చిన శవంతో సమానమని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. "చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా అది తిరిగి రాదు. బీఆర్ఎస్ భవిష్యత్తు ముగిసిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఉద్యమం కాపాడింది, ఆ తర్వాత అధికారం కాపాడింది. కానీ ఇప్పుడు ప్రజలు ఆ పార్టీని, ఆ కుటుంబాన్ని వద్దనుకుంటున్నారు" అని ఆయన పేర్కొన్నారు.
కుటుంబ కుంపటి - ఆస్తుల పంచాయతీ!
కేసీఆర్ కుటుంబంలో ప్రస్తుతం జరుగుతున్నది రాజకీయ పోరాటం కాదు, కేవలం ఆస్తుల పంచాయతీ మాత్రమేనని ముఖ్యమంత్రి విమర్శించారు. "కేసీఆర్ కుటుంబంలో ఒకరిని ఒకరు తప్పించుకునే ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతోంది. పంపకాల్లో తేడాలు రావడం వల్లే కుటుంబ కుంపటి మొదలైంది. వారిలో ఎవరు నెగ్గుతారో వారికే తెలియాలి."కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేటీఆర్ ఆ కుర్చీ కోసం ఒత్తిడి తెచ్చారని, కేసీఆర్ కుర్చీపై కేటీఆర్ ఎప్పుడో కన్నేశారని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ చెడు కోరుకునేది ఆయన కుటుంబ సభ్యులేనని, కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్న రాజకీయ నాయకుడని పేర్కొన్నారు.
హైడ్రాపై విమర్శలు అందుకే..
అక్రమాస్తులను తొలగిస్తుంటే ఓర్వలేకనే హైడ్రా (HYDRA)పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ తనకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, ఆ కుటుంబంపై మాట్లాడే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు. "కేసీఆర్ ఆస్తి నాకు రాదు, నాకేం అవసరం? ఆయన్ని రాజకీయంగా ప్రతి ఏటా ఓడిస్తూనే వస్తున్నాను. ఎన్నికల్లో నాకు ప్రత్యర్థులే లేరు" అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.




