Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. మెట్రో విస్తరణపై కేంద్రంతో భేటీ.. కేబినెట్ కూర్పుపై అధిష్ఠానంతో చర్చ!

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణపై కేంద్ర మంత్రులతో, అలాగే తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలతో చర్చలు జరపనున్నారు.

Arun Chilukuri
Published on: 6 May 2026 7:05 AM IST
Revanth Reddy
X

Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. మెట్రో విస్తరణపై కేంద్రంతో భేటీ.. కేబినెట్ కూర్పుపై అధిష్ఠానంతో చర్చ!

Revanth Reddy: ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. పెండింగ్‌ అంశాలతో పాటు హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణపై పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే.. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అవుతారనే చర్చ.. పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.

కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగుతోంది. అయితే.. ఈ విజయంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. కేరళంలో ప్రచారం నిర్వహించిన రేవంత్.. అక్కడ పార్టీ విజయానికి సహకరించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story