Parkal: పరకాలలో రూ. వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు!

Parkal: పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు రూ. వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Aug 2026 10:01 PM IST
Parkal
X

Parkal: పరకాలలో రూ. వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు!

పరకాల: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొత్తగా చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

శంకుస్థాపన చేసిన పనుల వివరాలు:

🔹రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్

🔹రూ. 82 కోట్లతో పరకాల మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులు

🔹రూ. 65 కోట్లతో పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం

🔹రూ. 45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణం

🔹రూ. 32.17 కోట్ల అంచనా వ్యయంతో దామెర మండలం ల్యాదేళ్లలో పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్ నిర్మాణం

🔹రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో అక్కంపేట గ్రామంలో అభివృద్ధి ప్రణాళిక పనులు

🔹రూ. 5 కోట్లతో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులు

🔹ఆత్మకూర్‌లో టౌన్‌షిప్ అండర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌కు శంకుస్థాపన

🔹రూ. 3 కోట్లతో పరకాల పట్టణంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన

🔹రూ. 1.10 కోట్లతో విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయ నిర్మాణం

ప్రారంభోత్సవాల వివరాలు:

🔹పరకాలలో రూ. 35 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభం.

🔹ఆత్మకూర్‌లో రూ. 1 కోటితో నిర్మించిన అధునాతన SPM సెంటర్ ప్రారంభం.

🔹పరకాలలో రూ. 5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం ప్రారంభం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story