Revanth Reddy: "అల్లుడు, కొడుకు కలిసి కేసీఆర్‌ను గృహనిర్బంధం చేశారు": సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Revanth Reddy: "అల్లుడు, కొడుకు కలిసి కేసీఆర్‌ను గృహనిర్బంధం చేశారు": సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన, రాష్ట్ర రాజకీయాలు, ఆర్థిక పరిస్థితి మరియు కీలక కేసులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రధానాంశాలు:
రాష్ట్రంలో విద్యావ్యవస్థ మార్పుపై కమిటీ అధ్యయనం చేస్తోందని, జాతీయ స్థాయి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టప్రకారమే ముందుకు వెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోవడం వల్లే దర్యాప్తు ఆలస్యమైందని, కేసు కొట్టేసినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేశారు.
"మేము అధికారంలోకి వచ్చాక రూ.3.47 లక్షల కోట్లు అప్పు చేశాం. అందులో రూ.3.30 లక్షల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పుల అసలు, వడ్డీలు కట్టడానికే సరిపోయింది. కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే వాడుకున్నాం" అని వివరించారు. రాష్ట్ర జీఎస్‌డీపీ జాతీయ జీడీపీ కంటే మెరుగ్గా ఉందన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై స్పందిస్తూ.. "అల్లుడు, కుమారుడు కలిసి కేసీఆర్‌ను గృహనిర్బంధం చేశారు" అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో డ్రగ్స్ పట్టుబడుతున్నా బీజేపీ నేతలు నోరు మెదపకపోవడం, బీఆర్ఎస్-బీజేపీ మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందానికి నిదర్శనమని ఆరోపించారు.
హిల్ట్ పాలసీ, టీడీఆర్ అంశాలపై కేటీఆర్, హరీష్ రావులకు ఏ ఏజెన్సీతోనైనా విచారణకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.
జీఎస్టీ వసూళ్లు గత రెండు నెలల్లో రూ.4 వేల కోట్లు దాటడం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సానుకూల సంకేతమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.




