Revanth Reddy: ఓటు పోతే జీవితం పోయినట్లే.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
Revanth Reddy: ప్రజలకు ఓటు హక్కు అనేది అత్యంత కీలకమైనదని, ఓటు పోతే వారి జీవితమే పోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
Revanth Reddy: ఓటు పోతే జీవితం పోయినట్లే.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
Revanth Reddy: ప్రజలకు ఓటు హక్కు అనేది అత్యంత కీలకమైనదని, ఓటు పోతే వారి జీవితమే పోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ, ఇందిరమ్మ ఇళ్లు మరియు తన ఓటు బదిలీ అంశాలపై పలు కీలక విషయాలను వెల్లడించారు.
రాష్ట్రంలో ఇప్పటికే 70 శాతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగిసిందని, ఇంకా 30 శాతం మిగిలి ఉందని సీఎం తెలిపారు. "ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజలంతా తమ స్వగ్రామాల్లోనే ఉండాలి. ఇది కేవలం నాయకులకు సంబంధించింది కాదు, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. బిఎల్‌ఏ (BLA)ల కంటే గల్లీల్లో ఉండే పార్టీ కార్యకర్తలే స్థానిక ఓటర్లను బాగా గుర్తుపడతారు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు నిరంతరం అలర్ట్‌గా ఉండాలి" అని పిలుపునిచ్చారు.
తనకు రెండు చోట్ల ఓటు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. "నాకు రెండు ఓట్లు ఉన్నాయనడంలో నిజం లేదు. నిబంధనల ప్రకారమే నా ఓటును కొడంగల్ నుంచి బదిలీ చేయించుకున్నాను. గతంలో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కొన్ని గ్రామాలు కర్ణాటక పరిధిలో ఉండేవి" అని వివరించారు. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లను తొలగిస్తే అవి కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లను గమనించాలన్నారు.
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సంపూర్ణ సిద్ధంగా ఉందన్నారు. "గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు దక్కాల్సిన ఇళ్లను దళారులకు అమ్ముకున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా పారదర్శకంగా ఇళ్లను అందిస్తాం" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.




