Revanth Reddy: చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు అగాఖాన్ ఫౌండేషన్ సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగాఖాన్-Vతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.
Revanth Reddy: చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు అగాఖాన్ ఫౌండేషన్ సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రిన్స్ రహీమ్ అగాఖాన్-V భేటీ అయ్యారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమిట్‌కు హాజరుకావాల్సిందిగా ఆయనను సీఎం సాదరంగా ఆహ్వానించారు. ఈ సమిట్‌కు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు.
వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగాఖాన్ ఫౌండేషన్ పాత్ర అత్యంత కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. తమ ప్రభుత్వంపై, ఫౌండేషన్‌పై ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు.
ఫౌండేషన్ సహకారంతో ఇప్పటికే మండలి భవనం, కుతుబ్ షాహీ టూంబ్స్‌ను విజయవంతంగా పునరుద్ధరించుకున్నామని గుర్తుచేశారు.
మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అదేవిధంగా సిటీ కాలేజ్, ఉస్మానియా ఆస్పత్రి చారిత్రక భవనాల పునరుద్ధరణకు కూడా అగాఖాన్ ఫౌండేషన్ సాయం కోరినట్లు సీఎం తెలిపారు.




