Revanth Reddy: తెలంగాణ విద్యారంగంలో సరికొత్త అధ్యాయం.. నేడే తొలి పబ్లిక్ స్కూల్ ప్రారంభం!
Revanth Reddy: తెలంగాణ విద్యారంగంలో సరికొత్త విప్లవం. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో కార్పొరేట్ స్థాయి వసతులతో నిర్మించిన తొలి 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు.
Revanth Reddy: తెలంగాణ విద్యారంగంలో సరికొత్త అధ్యాయం.. నేడే తొలి పబ్లిక్ స్కూల్ ప్రారంభం!
Revanth Reddy: తెలంగాణ విద్యారంగంలో తొలి నూతన ఆధ్యాయానికి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలన్న సంకల్పానికి రేవంత్ సర్కార్ నాంది పలుకుతుంది. రంగారెడ్డి జిల్లాలో మంచాల మండలం ఆరుట్లలో కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. విద్యార్ధులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తారు.
పాఠశాలలో అత్యాధునికంగా తీర్చిదిద్దిన డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, క్రీడా మైదనాలను పరిశీలిస్తారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్ ను సీఎం ఆవిష్కరిరిస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.




