Revanth Reddy: యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు.. కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆశీస్సులు!
Revanth Reddy: పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Revanth Reddy: పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకుని స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు.
ముఖ్యమంత్రి గారితో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు.
Next Story




