Karimnagar: సమస్య ఏదైనా.. పరిష్కారం వెంటనే -కలెక్టర్ చిత్రా మిశ్రా!

Karimnagar: కరీంనగర్ జిల్లా ప్రజావాణిలో అందిన 225 దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 March 2026 12:23 PM IST
Karimnagar
X

Karimnagar: సమస్య ఏదైనా.. పరిష్కారం వెంటనే -కలెక్టర్ చిత్రా మిశ్రా!

కరీంనగర్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి నేడు 225 దరఖాస్తులు అందాయి.

ప్రజావాణి అర్జీలపై విచారణ జరిపి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులపై నిర్లక్ష్యం వహించవద్దని పేర్కొన్నారు.

సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కి వస్తారని, ఫిర్యాదులపై ఆయా శాఖల అధికారులు సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.

ప్రజావాణి ఫిర్యాదులు 225..

ప్రజావాణి కార్యక్రమంలో 225 ఫిర్యాదులు వినతులు వచ్చాయి. సంబంధిత అధికారులు పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వృద్ధుల వద్దకే స్వయంగా జిల్లా కలెక్టర్ వెళ్లి వినతి పత్రాలను స్వీకరించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. సమస్యలను ఆలకించి తక్షణం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

బల్దియా ప్రజావాణిలో 22 ఫిర్యాదులు..

నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 23 ఫిర్యాదులు అందినట్లు నగరపాలక కమిషనర్ ప్రభుదేశాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. విభాగాల వారీగా దరఖాస్తులను నిర్ణిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు పెండింగ్లో లేకుండా చూడాలని ప్రతి విభాగం అప్రమత్తంగా ఉంటూ పనులు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్, ఆర్డీవో కే మహేశ్వర్ డి ఆర్ డి ఓ శ్రీధర్ గృహ నిర్మాణశాఖ పిడి శ్రీనివాసు పలు అధికారులు, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, డిసిపి, అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story