Collector Chitra Mishra: ప్రమాదాల నివారణకు సమన్వయంతో కదలాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Collector Chitra Mishra: జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ చిత్రా మిశ్రా కీలక ఆదేశాలు. రోడ్డు ప్రమాదాల నివారణకు 'అరైవ్-అలైవ్' పేరుతో ప్రత్యేక చర్యలు

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 March 2026 6:47 PM IST
Collector Chitra Mishra
X

Collector Chitra Mishra: ప్రమాదాల నివారణకు సమన్వయంతో కదలాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Collector Chitra Mishra: వివిధ శాఖల అధికారులు సమన్వయంతో రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రమాదాలు నివారించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు.కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ ప్రమాదాలు జరిగే చోట్లను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో, రహదారుల్లో రోడ్లు, డ్రైనేజీలు మరమ్మతులు సమయంలో వాహనదారులు గుర్తించేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొన్ని పనులు దీర్ఘకాలం పాటు జరిగే అవకాశం ఉన్నందున అక్కడ వాహన ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సమన్వయంతో ప్రమాదాల నివారణ..

ప్రమాదాల్లో బాధితులకు తక్షణ వైద్య సాయం అందేలా ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.

ప్రజాపాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అరైవ్-అలైవ్ పేరుతో రోడ్డు భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అందువల్ల అధికారులు రోడ్డు భద్రతపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రమాదకర మలుపులు, సిగ్నలింగ్ పై దృష్టి సారించాలని , రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

అన్ని శాఖలతో కలిసి చర్యలు చేపడతాం..

పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ జిల్లాలో 24 ప్రమాదాలు ఎక్కువగా జరిగే చోట్లు ఉన్నాయని తెలిపారు. హెచ్చరిక బోర్డులు, రోడ్డు వైపు పెరిగిన కొమ్మలు కత్తిరించడం తదితర చర్యల ద్వారా ప్రమాదాలు నివారించాలని సూచించారు. నగరంలో బ్లికింగ్ బల్బులు, జంక్షన్లలో సిగ్నలింగ్, లైటింగ్ వ్యవస్థ కు సంబంధించి పలు సూచనలు చేశారు. జగిత్యాల రోడ్డుకు ఇరు ప్రక్కల పొదలు, కొమ్మలను తొలగించడం ద్వారా ప్రమాదాలను నివారించగలమని తెలిపారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, ఆర్టిఏ కమిటీ మెంబర్ పడాల రాహుల్, రోడ్లు భవనాల శాఖ ఈఈ నరసింహచారి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story