Vikarabad: బసవన్న ఆశయాలను ఆచరిద్దాం.. కలెక్టర్ దీపక్ తివారి!
Vikarabad: జిల్లా కలెక్టరేట్‌లో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Vikarabad: బసవన్న ఆశయాలను ఆచరిద్దాం.. కలెక్టర్ దీపక్ తివారి!
Vikarabad: మహాత్మా బసవేశ్వర జయంతి సందర్బంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి. సోమవారం కలెక్టరెట్ కార్యాలయ సమావేశం హాలు నందు బి సి వెల్ఫేర్ అధికారి ఆధ్వర్యంలో లో ఏర్పాటు చేసిన మహాత్మా బసవేశ్వర జయంతి సందర్బంగా జిల్లా అధికారులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ
సామాజిక సమానత్వం, న్యాయం, మరియు సదాచారం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు బసవన్న, కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ మహోన్నత సందేశంతో సమాజానికి మార్గదర్శకత్వం వహించారని,ఆయన బోధనలు నేటికీ సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నాయని అన్నారు.
వారి ఆశయాలను ఆచరణలో పెట్టి, సమానత్వం, సౌభ్రాతృత్వం, సేవా భావంతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా జడ్ పి సి ఇ ఓ సుధీర్, డి ఆర్ డి ఓ శ్రీనివాస్,ఆర్ డి ఓ వాసు చంద్ర, బి సి వెల్ఫేర్ అధికారి మాధవ రెడ్డి, వివిధ శాఖ ల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.




