Rajanna Sircilla: ఎయిడ్స్ బాధితులకు అండగా ప్రభుత్వం.. మెరుగైన వైద్యంపై కలెక్టర్ హామీ

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 3:17 PM IST
Rajanna Sircilla
X

Rajanna Sircilla: ఎయిడ్స్ బాధితులకు అండగా ప్రభుత్వం.. మెరుగైన వైద్యంపై కలెక్టర్ హామీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: కేంద్రంలో ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక లో భాగంగా 99 రోజుల కార్యాచరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. ర్యాలీ అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక లో భాగంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని, రోగులకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ఇంకా మెరుగైన వైద్య సేవల కోసం కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫర్ చేయాలని ఆదేశించారు. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా ఎయిడ్స్ నియంత్రణపై అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రి, అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఎయిడ్స్ బాధితులకు మెరుగైన వైద్యం, మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రజిత, జీ జీ హెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story