Jammikunta: ఏళ్ల నిరీక్షణకు మోక్షం.. జమ్మికుంటలో డయాలసిస్ కేంద్రాలు

Jammikunta: జమ్మికుంట, కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 17 April 2026 5:58 PM IST
Jammikunta
X

Jammikunta: ఏళ్ల నిరీక్షణకు మోక్షం.. జమ్మికుంటలో డయాలసిస్ కేంద్రాలు

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి మంత్రులు, దామోదర రాజనర్సింహ పొన్నం ప్రభాకర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రణవ్ బాబు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు ఏళ్ల తరబడి నిరీక్షణకు మోక్షం.

తీరనున్న డయాలసిస్ బాధితుల కష్టాలు.హుజురాబాద్,జమ్మికుంట,కమలాపూర్ మూడు పి.హెచ్.సి లో డయాలసిస్ సెంటర్ లు.చారిత్రక నిర్ణయానికి నాంది పలికిన ప్రణవ్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య విషయంలో పేద జీవితాలకు ఉపయోగపడే నిర్ణయాలు.తీసుకుంటున్నామని,డయాలసిస్ రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వారు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లి డయాలసిస్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందని గమనించి వారికి ఇబ్బందులు తలెత్తకుండా.

జమ్మికుంట,కమలాపూర్ దవాఖానలో డయాలసిస్ సెంటర్ లు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ మంజూరు చేయించడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. జమ్మికుంట, పట్టణంలోని ప్రభుత్వ దావఖానలో డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఇదొక చారిత్రక నిర్ణయమని,పేదలు పరిస్థితి బాగోలేక వ్యాధి బారిన పడితే సుదూర ప్రాంతాలకి వెళ్లి చికిత్స చేసుకోవడం ఇబ్బందిగా మారిందని, ఇప్పుడు ఈనిర్ణయం వల్ల కేవలం జమ్మికుంట ప్రాంతమే కాకుండా చుట్టు పక్కన ఉన్న ప్రాంతాల ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. వైద్య విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని ఆసుపత్రుల మౌలిక సదుపాయాల కోసం నియోజక వర్గ ఇంచార్జి ప్రణవ్ జమ్మికుంట,

హుజూరాబాద్ ప్రధాన ఆసుపత్రులకు చెరొక 15 లక్షలు కేటాయించారని, ఇప్పుడు ఈ సెంటర్లు మంజూరు చేయించారని వారికి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలుగూరి సదయ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు గూడెపు సారంగపాణి మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి దుబ్బ మల్లన్న చైర్మన్,

ముద్దమల్ల రవి పొన్నగంటి మల్లయ్య దేశిని కోటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ చందా రాజు శ్రీపతి నరేష్ దిడ్డి రాము ఎగిత అశోక్ పొన్నగంటి విష్ణు యాట్ల అశోక్ మహిళా మండల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట స్వప్న పిడుగు భాగ్యలక్ష్మి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి సలీం పొన్నగంటి మధు చిన్నింటి బండి పవన్ నాగేంద్ర సలీం పాత ప్రసాద్ దేశిని శ్రీనివాస్ పాతకాల ప్రవీణ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story