Jeevan Reddy: కేసీఆర్‌తో జీవన్‌ రెడ్డి భేటీ.. ‘అన్నా’ అంటూ భావోద్వేగం!

Jeevan Reddy: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపించాడంటూ కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 10 April 2026 3:40 PM IST
Jeevan Reddy
X

Jeevan Reddy: కేసీఆర్‌తో జీవన్‌ రెడ్డి భేటీ.. ‘అన్నా’ అంటూ భావోద్వేగం!

Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

‘అన్నా’ అంటూ భావోద్వేగం:

కేసీఆర్‌ను కలిసిన సమయంలో జీవన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "అన్నా.. మీతో కలిసి పని చేయమని దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడన్నా" అంటూ మనసులోని మాటను బయటపెట్టారు. చాలా కాలం తర్వాత కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జీవన్ రెడ్డి స్పందిస్తూ.. ప్రస్తుతం రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో కేసీఆర్‌తో కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్లకైనా కేసీఆర్‌తో కలిసి పని చేసే అవకాశం రావడం తనకెంతో సంతోషాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. ఈ భేటీతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story