Karimnagar: కౌశిక్ రెడ్డికి పిచ్చి పట్టింది.. ఎర్రగడ్డలో చేర్పించాలి!

Karimnagar: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మొహమ్మద్ తాజోద్దీన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 2:39 PM IST
Karimnagar
X

Karimnagar: కౌశిక్ రెడ్డికి పిచ్చి పట్టింది.. ఎర్రగడ్డలో చేర్పించాలి!

కరీంనగర్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి పిచ్చి పట్టింది ఎర్ర గడ్డ లోని పిచ్చి ఆసుపత్రి లొ వెంటనే చేర్పించాలని జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ తాజోద్దిన్ అన్నారు. కడియం శ్రీహరి దళిత సీనియర్ నాయకులు రాష్ట మంత్రి ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే గా గత 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఒక పెద్ద నాయకుడు.

అలాంటి నాయకున్ని పట్టుకొని అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ మంత్రులు ఎమ్మెల్యే ముందు ఒక వీధి రౌడీ వలె గజ దొంగా వలె తుపాకీ తొ కాల్చివేస్తా అంటూ సైగ చేయడం చాలా బాధాకరం. ఒక ఎమ్మెల్యే అయిఉండి ఇలా చిల్లర చేష్టలు చేసిన పాగల్ కౌశిక్ రెడ్డి ని ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

కౌశిక్ రెడ్డి గతమంతా 420 కేసులే..

దళిత నాయకున్నీ అవమానించిన పాగల్ గాన్ని పిచ్చి ఆసుపత్రి లో చేర్పించాలని ఇతను గతం నుండి నేర చరిత్ర కలిగిన నాయకుడు అన్నారు. గతమంతా 420 పనులేనని వాటి మూసుగులో ఎంతోమంది బలయాదన్నారు. జిల్లా ఉన్నత పోలీసు అధికారినీ కులం పేరుతో తుర్కోడు అని యావత్ ముస్లిం ల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఇలా ఇతను అగ్ర వర్ణ కులానికి చెందినవాడు అనే అహం కారంతో ఎస్సీ బీసీ మైనారిటీ లను టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు దురుసుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ కేటీఆర్ ముందు పేరు సంపాదించాలని పిచ్చి వేషాలు వేస్తున్న ఇతన్ని కేసీఆర్ కేటీఆర్ తెరాస పార్టీ తొలగించాలని మరియు ఇతన్ని ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి లో చేర్పించాలని కోరారు. హుజురాబాద్ అసెంబ్లీ పేరు బద్నాం చేసిన కౌశిక్ రెడ్డిని హుజురాబాద్ ప్రజలు హుజురాబాద్ లొ కాలు పెట్టనివ్వద్ధని జిల్లా కాంగ్రెస్ మైనారిటీ డిపార్ట్మెంట్ పక్షాన కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story