Chalo Ankapur: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి హామీలపై కాంగ్రెస్ ఫైర్.. ఉద్రిక్తంగా ఆర్మూర్ పాలిటిక్స్!

Chalo Ankapur: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరింది.

Arun Chilukuri
Published on: 20 July 2026 10:41 AM IST
Chalo Ankapur
X

Chalo Ankapur: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి హామీలపై కాంగ్రెస్ ఫైర్.. ఉద్రిక్తంగా ఆర్మూర్ పాలిటిక్స్!

Chalo Ankapur: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రాజకీయం తీవ్ర రూపం దాల్చించింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో స్థానిక రాజకీయం ఒకసారిగా వేడెక్కింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన రూపాయికే వైద్యం, సొంత డబ్బులతో ఇళ్ల నిర్మాణం వంటి హామీలను ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇప్పటికీ నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు దాడికి దిగారు. ఇందులో భాగంగా చలో అంకాపూర్ కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వస్తే ఊరుకునేది లేదని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. చలో అంకాపూర్ నేపథ్యంలో ఇరుపార్టీల నాయకులు పోటా పోటిగా సిద్ధమవుతుండడంతో పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story