Karmanghat: హనుమంతుడి సాక్షిగా అక్రమాలు? ధర్మకర్తలపై భక్తుల పోరు!

Karmanghat: హైదరాబాద్ కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 March 2026 11:46 AM IST
Karmanghat
X

Karmanghat: హనుమంతుడి సాక్షిగా అక్రమాలు? ధర్మకర్తలపై భక్తుల పోరు!

Karmanghat: ధ్యానాంజనేయ స్వామి ఆలయాభివృద్ధికి దాతలు ఇచ్చిన విరాళాలు ధర్మకర్తలు దుర్వినియోగం చేస్తున్నారంటు భక్తులు ఆరోపిస్తున్నారు.హైదరాబాద్‌లోని కర్మన్ ఘాట్‌లోని ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆలయ అభివృద్ధి కోసం భక్తులు సమర్పించిన విరాళాలను కొంతమంది ధర్మకర్తలు అభివృద్ధి పనులకు వినియోగించకుండా, తమ స్వంత అవసరాలకు వాడుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఆలయ టెండర్‌దారుల నుంచి మాముళ్లు, విరాళాలు సేకరిస్తున్నట్టు భక్తులు ఆరోపిస్తున్నారు. ధర్మకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ ఆలయ ఈవో లావణ్యకు భక్తులు ఫిర్యాదు చేశారు.పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story