CP Sajjanar: ఎక్స్‌లో సైబర్ నేరాల అప్రమత్తపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ట్వీట్

CP Sajjanar: సైబర్ నేరాల కట్టడిలో బ్యాంకర్ల పాత్ర కీలకమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు.

Arun Chilukuri
Published on: 31 March 2026 12:26 PM IST
CP Sajjanar
X

CP Sajjanar: ఎక్స్‌లో సైబర్ నేరాల అప్రమత్తపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ట్వీట్

CP Sajjanar: సైబర్ నేరాల నుంచి సామాన్య ప్రజలను కాపాడటంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కీలకమైందని అన్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు తమ కస్టమర్ల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వారు ఏదైనా మోసానికి గురవుతున్నట్లు గమనిస్తే వెంటనే అప్రమత్తం చేయాలని అన్నారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాల బారిన పడినప్పుడు కస్టమర్లు తమ డిపాజిట్లను హుటాహుటిన విత్‌డ్రా చేయడం, బంగారంపై అప్పులు తీసుకోవడం వంటివి చేస్తుంటారు.

అటువంటి సమయాల్లో వారి ప్రవర్తనలో ఏవైనా మార్పులు, ఆందోళన కనిపిస్తే ఆరా తీయాలని అన్నారు. ముఖ్యంగా వృద్థులు, పెన్షనర్లు జీవితకాలపు సంపాదనను మోసగాళ్ల మాయలో పడి పోగొట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని సజ్జనార్ అన్నారు. ఒకవేళ ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనిస్తే వెంటనే పోలీసులకు, 1930 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు కూడా పోలీసుల హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బ్యాంకర్లు, పోలీసులు, ప్రజల సమన్వయంతోనే సైబర్ నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతోందని ఆయన పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story