Kaleshwaram: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐఎం నేతల ధ్వజం!

Kaleshwaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను, కన్నెపల్లి పంపు హౌస్‌ను సీపీఐ(ఎం) రాష్ట్ర బృందం పరిశీలించింది.

Narender, Staff Reporter  -Warangal
Published on: 18 July 2026 5:37 PM IST
Kaleshwaram
X

Kaleshwaram: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐఎం నేతల ధ్వజం!

కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపు హౌస్, మేడిగడ్డ,అన్నారం బ్యారేజీ లను సిపిఐఎం రాష్ట్ర నాయకుల బృందం పరిశీలించారు.సిపిఐ (ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు లతో పాటు రాష్ట్ర నాయకులు పర్యటించారు.

ప్రాజెక్టు ద్వారా నీటి లభ్యత విషయమై పరిస్థితులను సమీక్షించారు.ఈ సందర్భంగా..సిపిఐఏం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు లు మాట్లాడుతూ.ప్రతినిత్యం ఒక టీఎంసీ నీరు గోదావరి నదిలో వృధాగా పోతుందని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో వాడుకునే అవకాశం లేదన్నారు. ఎల్నివో ప్రభావంతో దేశంలో, రాష్ట్రంలో విపరీతమైన కరువు పరిస్థితులు ఏర్పడి సాగు, త్రాగునీరు లభించడం కష్టంగా మారిందన్నారు.

రైతాంగం కోట్ల రూపాయల పెట్టుబడితో పంటలు సాగు చేసుకుని వర్షం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.ఈ క్రమంలో కన్నెపల్లి పంపు హౌస్ వద్ద గోదావరి లో ఉన్న ప్రస్తుత నీటిమట్టంతో నీటిని ఏమైనా ఉపయోగించుకునే అవకాశం ఉందా పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు.గత వారం క్రితం సుమారు లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా పోయిందని గుర్తు చేశారు.

బ్యారేజీలలో నీటిని నిల్వ చేసుకోవచ్చని ఓ పార్టీ, చేసుకోరాదని మరికొన్ని పార్టీలు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి, నిపుణులతో చర్చించి తమ పార్టీ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు.నీటి కరువు పరిస్థితులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించడం లేదని మండిపడ్డారు.

ఇలాంటి కరువు పరిస్థితుల్లో పార్టీలకు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు.లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ ప్రాజెక్టును ప్రభుత్వం మరమ్మతులు చేసి ముందుకు కొనసాగిస్తుందా... లేక మరో కొత్త ప్రాజెక్టును నిర్మిస్తుందా అనే విషయమై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని వారు ప్రశ్నించారు.

ప్రభుత్వాలు ఇస్టారీతిన ప్రజాధనంతో ప్రాజెక్టులు నిర్మించి వృధాగా వదిలేయడం సమాజానికి తీరని నష్టమని అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మూడు నుండి నాలుగు టీఎంసీలు నీటిని తరలించుకోవచ్చు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ డి ఎస్ ఏ కు లేఖ రాయడం కాదని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అనుమతులు తీసుకురావచ్చు కదా అన్నారు.ఈ ప్రాజెక్టు పై కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది.ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story