CV Anand: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌..!

CV Anand: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఈ నెలాఖరులోపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Arun Chilukuri
Published on: 25 April 2026 10:52 AM IST
CV Anand
X

CV Anand: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌..!

CV Anand: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ (డైరెక్టర్ప జనరల్ ఆఫ్ పోలీస్) నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను తదుపరి డీజీపీగా నియమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండటంతో, ప్రభుత్వం కొత్త బాస్ ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది.

డీజీపీ పదవి కోసం అర్హులైన అధికారుల జాబితాను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఆ జాబితాలో ముగ్గురి పేర్లు ప్రధానంగా ఉన్నాయి. సీవీ ఆనంద్‌ (1991 బ్యాచ్), వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే (1994 బ్యాచ్), సౌమ్యమిశ్రా (1994 బ్యాచ్) ఈ ముగ్గురిలో సీవీ ఆనంద్‌ అత్యంత సీనియర్ అధికారి కావడం, ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో ఆయన నియామకం దాదాపు ఖాయమని తెలుస్తోంది.

శుక్రవారం ప్రభుత్వం చేపట్టిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను శిఖాగోయెల్‌కు అప్పగించారు. అప్పటి వరకు ఆ బాధ్యతల్లో ఉన్న సీవీ ఆనంద్‌ను ఆ పదవి నుంచి తప్పించడం వెనుక, ఆయనను డీజీపీగా నియమించబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరులోపు (ఏప్రిల్ 30) ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story