Karimnagar: ఆసిఫ్‌నగర్ బావుపేటలో సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై అవగాహన సదస్సు

Karimnagar: కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ బావుపేటలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 March 2026 11:59 AM IST
Karimnagar
X

Karimnagar: ఆసిఫ్‌నగర్ బావుపేటలో సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై అవగాహన సదస్సు

Karimnagar: మండలంలోని ఆసిఫ్‌నగర్ బావుపేట గ్రామంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలనపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐపీఎస్ అధికారి సోహం సునీల్ (SHO) మరియు సి.ఐ. కోటేశ్వరరావు హాజరయ్యారు.

​సైబర్ నేరాల పట్ల అప్రమత్తత..

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయని హెచ్చరించారు. గుర్తు తెలియని లింకులు క్లిక్ చేయవద్దని, ఓటిపి (OTP)లు ఎవరికీ షేర్ చేయకూడదని సూచించారు. ఏదైనా మోసం జరిగిన వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

​మాదకద్రవ్యాల రహిత సమాజం..

యువత మాదకద్రవ్యాలకు (Drugs) బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని కొత్తపల్లి ఎస్.హెచ్.వొ. సోహం సునిల్ పిలుపునిచ్చారు. గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు డయల్ 100 ద్వారా లేదా స్థానిక పోలీసులకు తెలపాలని కోరారు. గ్రామాన్ని నేరరహితంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజనేయులు, ఉప సర్పంచ్ కర్ణాకర్, ఇతర వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా, పోలీసులు, ప్రజా ప్రతినిధులు కలిసి గ్రామంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తామని ప్రతిజ్ఞ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story