Hyderabad: ఐటీ కంపెనీలకు అలర్ట్.. ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి!
Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షాల సూచన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు.
Hyderabad: ఐటీ కంపెనీలకు అలర్ట్.. ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి!
Hyderabad: నగరంలో సోమవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. వర్షం కారణంగా సాయంత్రం పీక్ అవర్స్‌లో రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున ఐటీ రంగానికి చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థలు మరియు ఇతర ప్రైవేటు కంపెనీలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ మేరకు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు దశల వారీగా ముందస్తు లాగౌట్ సౌకర్యాన్ని కల్పించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
సాయంత్రం అందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తే ఐటీ కారిడార్‌లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున, వివిధ విభాగాలు, ప్రాజెక్టులకు వేర్వేరు సమయాల్లో లాగౌట్ కల్పించాలని కోరారు.
ఉద్యోగుల ప్రయాణ భద్రత మరియు నగరంలో సజావుగా ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా ప్రతి సంస్థ సైబరాబాద్ పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.
సంస్థలు తమ ఆఫీసు ఉన్న లొకేషన్ మరియు వారు కేటాయించిన ముందస్తు లాగౌట్ సమయాల వివరాలను వెంటనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
నగరవాసులు మరియు ఉద్యోగులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పోలీసులు హెచ్చరించారు.




