నిరుపేద విద్యార్థినిలకు వరం.. ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ ఉదారత

కరీంనగర్ జిల్లా గంగాధర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 14 మంది నిరుపేద విద్యార్థినిలకు ఉమెన్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సైకిళ్లు పంపిణీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 8:05 PM IST
Gangadhara
X

నిరుపేద విద్యార్థినిలకు వరం.. ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ ఉదారత

గంగాధర/కరీంనగర్: కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో బాలికల విద్యాభివృద్ధికి మరో ముందడుగు పడింది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థినిలకు చేయూతనిచ్చేందుకు ఉమెన్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ముందుకొచ్చింది. సోమవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 14 మంది విద్యార్థినిలకు సైకిళ్లను పంపిణీ చేశారు.

దూర ప్రాంతాల నుండి పాఠశాలకు వచ్చే బాలికలు రవాణా ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ సైకిళ్లను అందజేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేవలం సైకిళ్లే కాకుండా, గతంలో కూడా ఈ సొసైటీ విద్యార్థుల ఉపాధి కోసం కుట్టుమిషన్లు, శారీరక ధారుఢ్యం కోసం క్రీడా సామగ్రి వంటి పలు వస్తువులను అందించి తన దాతృత్వాన్ని చాటుకుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story