Siddipet: ప్రాణాలతో చెలగాటం.. అధికారుల నిర్లక్ష్యం

Siddipet: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ప్రమాదకరంగా మారిన కంచె లేని ట్రాన్స్‌ఫార్మర్లు. పాఠశాల, బ్యాంక్ వద్ద ఉండటంతో స్థానికులు ఆందోళన.

KARUNAKAR,	DUBBAK
Published on: 19 April 2026 9:16 AM IST
Siddipet
X

Siddipet: ప్రాణాలతో చెలగాటం.. అధికారుల నిర్లక్ష్యం

సిద్దిపేట జిల్లా: మిరుదొడ్డి మండల కేద్రంలోని జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కంచలేని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ప్రమాణాలకు ఆహ్వానం పలుపుతున్నాయి. ముఖ్యంగా యూనియన్ బ్యాంక్ వరిసరాలు, అందెకు వెళ్లే మూలమలుపు వద్ద ఉన్న స్థానిక ప్రాథమిక పాఠశాల దగ్గర ఎలాంటి రక్షణ లేకుండా ఉన్న. ట్రాన్స్ఫార్డర్లు ప్రజల్లో ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రతిరోజూ బ్యాంకు లావాదేవీల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుండగా, కంచె లేకుండా ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు ప్రమాదానికి దారి తీస్తుందోననే భయం వెంటాడుతోంది. చిన్నపిల్లలు, వృద్దులు ఎక్కువగా సంచరించే ఈ ప్రాంతాల్లో భద్రతా చర్యలు లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది ప్రజలు పలుమార్లు అదికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కంచెలేసి ట్రాన్స్ ఫార్మర్లల నుంచి ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా చూడలని కోరుతున్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story