Pawan Kalyan: అభిమాని కోసం హనుమకొండకు జనసేనాని

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ మానవత్వాన్ని చాటుకున్నారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 17 Jun 2026 7:06 AM IST
Pawan Kalyan
X

Pawan Kalyan: అభిమాని కోసం హనుమకొండకు జనసేనాని

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం తెలంగాణలోని హనుమకొండ కు వెళ్లనున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న యువ అభిమాని నిరంజన్‌ను పరామర్శించి అతని కోరికను నెరవేర్చనున్నారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పదిహేడేళ్ల వయస్సు కలిగిన నిరంజన్ కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన అభిమాన హీరో, నాయకుడు అయిన పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి కలవాలని అతను ఆకాంక్ష వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయం జనసేన పార్టీ వర్గాల ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి చేరడంతో ఆయన వెంటనే స్పందించినట్లు తెలుస్తోంది. అభిమాని మనోభావాలను గౌరవిస్తూ స్వయంగా హనుమకొండకు వెళ్లి నిరంజన్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు.

సాధారణంగా రాజకీయ కార్యక్రమాలు, ప్రభుత్వ బాధ్యతలతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్, ఒక అభిమాని కోరికను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని అతడిని పరామర్శించేందుకు సమయం కేటాయించడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. నాయకుడిగా మాత్రమే కాకుండా మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా మరోసారి తన ప్రత్యేకతను చాటుతున్నారని జనసేన కార్యకర్తలు పేర్కొంటున్నారు.

నిరంజన్‌ను కలిసిన అనంతరం పవన్ కళ్యాణ్ హనుమకొండలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన భద్రకాళీ ఆలయం వెళ్లనున్నారు. అక్కడ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం.అభిమాని కోరికను గౌరవిస్తూ స్వయంగా వెళ్లి పరామర్శించనున్న పవన్ కళ్యాణ్ నిర్ణయం అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. రాజకీయ నాయకుడు, సినీ నటుడు, ప్రజా ప్రతినిధి అనే హోదాలకు అతీతంగా అభిమానుల పట్ల ఆయనకు ఉన్న అనుబంధాన్ని ఈ పర్యటన మరోసారి ప్రతిబింబించనుంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story