Devarakadra: రాజకీయ రచ్చ.. కాంగ్రెస్ విమర్శలకు బిఆర్ఎస్ ఘాటు కౌంటర్
Devarakadra: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టారని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని బిఆర్ఎస్ నాయకులు ఖండించారు.
Devarakadra: రాజకీయ రచ్చ.. కాంగ్రెస్ విమర్శలకు బిఆర్ఎస్ ఘాటు కౌంటర్
Devarakadra: మహబూబ్ నగర్ జిల్లా, ఏప్రిల్ 18, దేవరకద్ర, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా బిఆర్ఎస్ నాయకులను దుర్భాషలాడడం సబబు కాదని దేవరకద్ర బి ఆర్ ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రోజు మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియా వేదికగా పదేపదే ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తో పాటు మా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ని అగౌరవ పదజాలంతో దూషిస్తూ పిచ్చి వ్రాతలు రాయడం సరికాదని హితవు పలికారు.
ఆల వెంకటేశ్వర్ రెడ్డి నల్ల మట్టి, ఇసుక అమ్మి అక్రమాస్తులు కూడా పెట్టాడు అని అబద్ధాలు ప్రచారం చేస్తూ, ప్రస్తుతం ఈ ప్రభుత్వంలోనే వాగులలో జెసిబి లతో ఇసుకను తోడి అమ్ముతున్నారని ఆరోపించారు.మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకుండా మాపై దృశప్రచారం చేస్తున్నారన్నారు. రైతులకు ఎల్లప్పుడూ సాగునీరు అందుబాటులో ఉండాలని, భూగర్భ జలాలు పెరగాలని ఊక చెట్టు వాగు పై కోయిల్ సాగర్ నుండి రామన్పాడు వరకు చెక్ డ్యామ్ లు నిర్మించడం వల్ల ఆ వాగు ఒక జీవనదిని తలపిస్తుందన్నారు.
మీ ప్రభుత్వం వచ్చాక కనీసం రైతుబంధు కూడా రావటమే లేదన్నారు. ఇథనాల్ కంపెనీ పక్కనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించడం వల్ల వేల మంది విద్యార్థులు అనారోగ్యానికి గురవుతారని, ఏడు మండలాల ప్రజలు మీకు ఓటు వేస్తేనే మీరు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నిమండలాల ప్రజలకు అందుబాటులో ఉండేలా స్కూల్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని కోరారు. మేము నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ కు మీ శిలాఫలకం పెట్టి ప్రారంభించుకున్నారని, మేము మంజూరు చేయించిన 100 పడకల ఆసుపత్రి కి మీ శిలాఫలకం వేసి నిర్మిస్తున్నారని,
ఫ్లై ఓవర్ బ్రిడ్జి వేసి దేవరకద్రను రెండు భాగాలుగా చీల్చారని అందుకే అండర్పాస్ శాంక్షన్ చేయించామన్నారు. మరి ఏమైంది అండర్ పాస్ అని నిలదీశారు. ఇప్పటికైనా సరే అండర్పాస్ నిర్మిస్తే దేవరకద్ర ప్రజల తరఫున మేమే మీకు సన్మానం చేస్తామని అన్నారు. ప్రజా వేదిక ఏర్పాటు చేయండి మీరు చేసిన అభివృద్ధి , మా ప్రభుత్వ హాయంలో చేసిన అభివృద్ధి పై చర్చిద్దామని దేవరకద్ర ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాలరాజ్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ రాందాస్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దొబ్బలి ఆంజనేయులు, కొండారెడ్డి, చలమారెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, పదవ వార్డ్ కౌన్సిలర్ కొండల్, మన్యంకొండ, అడ్డు, సిరాజ్, బాలకృష్ణ వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




