Karimnagar: చొప్పదండిలో అభివృద్ధి పనులకు శ్రీకారం
Karimnagar: చొప్పదండిలో 1వ వార్డు తోగురుమామిడికుంటలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్.
Karimnagar: చొప్పదండిలో అభివృద్ధి పనులకు శ్రీకారం
కరీంనగర్ జిల్లా: చొప్పదండి పట్టణంలోని 1వ వార్డు పరిధిలోని తోగురుమామిడికుంట ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్డు మరియు డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించాలనే లక్ష్యంతో ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, తోగురుమామిడికుంట ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు పరిష్కారమైతే ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొట్టే అశోక్, ముద్దం రాజేశ్వరి, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




