Jagtial: దేవుడి హుండీలో భక్తుడి ఫిర్యాదు.. కొండగట్టు అధికారులకు షాక్!
Jagtial: కొండగట్టు అంజన్న ఆలయ హుండీలో భక్తుడు వేసిన నిరసన లేఖ కలకలం సృష్టించింది.
Jagtial: దేవుడి హుండీలో భక్తుడి ఫిర్యాదు.. కొండగట్టు అధికారులకు షాక్!
జగిత్యాల జిల్లా: మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ అంజనేయ స్వామి ఆలయంలో భక్తుల అసంతృప్తి బహిర్గతమైంది. ఆలయంలో సరైన సౌకర్యాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ భక్తుడు, తన అభ్యంతరాలను లేఖ రూపంలో రాసి హుండీలో వేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హుండీ లెక్కింపు సమయంలో ఈ లేఖ వెలుగులోకి రావడంతో ఆలయ నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
లేఖలో భక్తుడు ఆలయ పరిసరాల్లో నెలకొన్న సమస్యలను స్పష్టంగా ప్రస్తావించారు. ముఖ్యంగా పరిశుభ్రత లోపం, కోనేరులను సక్రమంగా శుభ్రం చేయకపోవడం, మరుగుదొడ్లు లేకపోవడం లేదా ఉన్నవాటిని పట్టించుకోకపోవడం వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా, తాగునీటి కొరత కూడా ఆలయంలో ప్రధాన సమస్యగా ఉందని లేఖలో పేర్కొన్నారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, వాటిపై అధికారులు దృష్టి సారించడం లేదని విమర్శించారు.




