Nizamabad: AI ఆధారిత ట్రాఫిక్ నిఘా.. వి.ఐ.డి.ఎస్ వ్యవస్థ ప్రారంభం

Nizamabad: నిజామాబాద్ జిల్లా చంద్రాయన్‌పల్లి వద్ద డీజీపీ బి. శివధర్ రెడ్డి వి.ఐ.డి.ఎస్ (VIDS) వ్యవస్థను ప్రారంభించారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 14 April 2026 6:53 PM IST
Nizamabad
X

Nizamabad: AI ఆధారిత ట్రాఫిక్ నిఘా.. వి.ఐ.డి.ఎస్ వ్యవస్థ ప్రారంభం

Nizamabad: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గల 44వ జాతీయ రహదారి గల చంద్రాయన్ పల్లి గ్రామం వద్ద వి.ఐ.డి.ఎస్ (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ) ను తెలంగాణ రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి, ఐ. పి. ఎస్.ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తూచా తప్పకుండా పాటించాలని హెల్మెట్లు తప్పనిసరి ధరించాలని,

పిల్లలు కూడా హెల్మెట్ ఏర్పాటు చేసి ప్రయాణించాలని జాతీయ రహదారిపై డిఫెన్స్ డ్రైవింగ్ తప్పకుండా పాటించాలని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు సూచనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని వాహనానికి వాహనానికి డిస్టెన్స్ ఉంచాలని వాహనం వేగంగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనపై ఆధారపడ్డ వారి కి కన్నీరు మిగిల్చ రాదని సీటు బెల్టు తప్పనిసరి ధరించాలని అన్నారు.

ఈ నిబంధనలు మన వద్ద ఉంచుకోకుండా ఇతరులకు కూడా అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు.అనంతరం గ్రామ ప్రజలతో అరేవ్ అలైవ్ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. వి.ఐ.డి.ఎస్ (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థకు)సంబంధించినటువంటి ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ప్రారంభించరు.

ఇది మానవ ప్రమేయం లేకుండా ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షించడానికి, AI విశ్లేషణలతో కూడిన హై-డెఫినిషన్ నిఘా కెమెరాలను ఉపయోగిస్తుందన్నారు.ఈ కార్యక్రమం లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి , నిజామాబాదు ఇన్చార్జి ఏసిపి రాజా వెంకటరెడ్డి , ఆర్మూర్ ఏసిపి వెంకటరెడ్డి , డిచ్పల్లి సిఐ కె. వినోద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ , ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్ , డిచ్ పల్లి ఎస్సై ఆరీఫ్ , ఇందల్ వాయి ఎస్. ఐ జి.సందీప్ , ఈ -డార్ మేనేజర్ వర్ష , ప్రాజెక్ట్ మేనేజర్ వంశీధర్ , టోల్ ప్లాజా మేనేజర్ వీరబాలు , గ్రామ సర్పంచ్ రఘు గ్రామ ప్రజలు పాలుగోన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story